ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరణ

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 09:03 PM

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. వ్యాధిని గుర్తించేందుకు డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యుటీని రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa