ఉపాధి నిధుల వినియోగంపై మంగళవారం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేంద్ర అధికారులు ఆలూరు మండలంలో పర్యటించారు. ఉపాధి నిధులతో నిర్మించిన సచివాల య భవనాలు ఫారం ఫండ్స్, రోడ్లను పరిశీలించారు. సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్‌బికే కేంద్రాలకు ఎందుకు పేరులు రాయలేదని సీనియర్ అకౌంట్స్ అధికారి రాజేష్ కుమార్ పంచాయతీ రాజ్ అధికారులను ప్రశ్నించారు. ఈ తనిఖీల్లో కేంద్ర బృందం సభ్యులు మొహమ్మద్ చాంద్, ఆలూరు ఎపీడీ పద్మావతి, ఎంపీడీవో సయ్యద్ మహబూబ్ భాష, సీఎల్‌ఆర్‌సీ కోర్స్ డైరెక్టర్ సురేష్ బాబు, పీఆర్‌జేఈ చౌడ్ రెడ్డి, ఏపీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa