ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతిక సమస్యతో వెనుతిరిగిన విమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 03:27 PM

ముంబై నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలోనే అత్యవసరంగా దిగింది. గత రాత్రి 8 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 50 నిమిషాల ప్రయాణం అనంతరం తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa