ఆరోగ్యానికి మంచివని చాలా మంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటారు. ఒకట్రెండు రోజులు వండగానే.. మళ్లీ నార్మల్ రైస్‌కి షిఫ్ట్ అయిపోతారు. దీనికి కారణం. ఇవి మిగతారైస్‌లా త్వరగా ఉడకవు. కాస్తా లెంథీ ప్రాసెస్. పైగా టేస్ట్ కూడా కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే, వీటన్నింటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో నార్మల్ రైస్‌లానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్. దానికి ఏం చేయాలో తెలుసుకోండి.
ముందుగా కడగడం
ముందుగా ఈ బియ్యాన్ని చక్కగా కడగండి. ఇందులో కొద్దిగా పిండిలాంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని కడగకపోతే ఉడికేటప్పుడు జిగురుగా మారుతుంది. దీంతో రైస్ మరింత జిగురుగా మారుతుంది. కాబట్టి, బియ్యాన్ని చక్కగా కడగండి. కడిగినప్పుడు నీరు ప్లెయిన్‌గా వచ్చేవరకూ కడగండి.
బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారా..?
నీటి నిష్పత్తి
ఇక నీరు పోసినప్పుడు సరైన కొలతలతో పోయండి. ఓ కప్పు రైస్‌కి రెండు కప్పుల నీరు అవసరం. కాస్తా మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని నీరు కూడా పోసి కాసేపు నాననివ్వండి. దీంతో అన్నం త్వరగా ఉడుకుతుంది. కాబట్టి, చక్కగా నాననివ్వండి. అన్నం కూడా పొడిపొడిలా వస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఇక ఈ బియ్యాన్ని ఉడికించేటప్పుడు ఓ టీస్పూన్ పరిమాణంలో ఆలివ్ ఆయిల్ కలపండి. దీంతో బియ్యం సరిగా ఉడుకుతుంది. అన్నం కూడా పొడిపొడిగా వస్తంది. పైగా ఆలివ్ ఆయిల్ కలుపుతాం కాబట్టి, ఎక్స్‌ట్రా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి, టీస్పూన్ పరిమాణంలో ఆయిల్ కలపండి.
ఉడికించడం
ఇప్పుడు అన్నాన్ని ఉడికించండి. దీనికోసం మంటని ఎక్కువగా కాకుండా తక్కువగా పెట్టండి. నిదానంగా ఉడికితేనే అన్నం చక్కగా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతీ మెతుకు చక్కగా ఉడుకుతుంది. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కాస్తా నీరు ఉండగానే మంటని ఆఫ్ చేసి మూతపెట్టండి. ఓ పది, 15 నిమిషాలు మూత తీయొద్దు. దీంతో అన్నం ఆ వేడికి చక్కగా తయారవుతుంది.
బ్రౌన్‌రైస్ రెసిపీస్
అయితే, రెగ్యులర్‌గా బ్రౌన్ రైస్ తినడం కొన్నిసార్లు బోర్‌గా అనిపిస్తుంది. దీనిని టేస్టీగా తినేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
ఫ్లేవర్డ్ రైస్
ఈ బ్రౌన్ రూస్‌ని మనం నిమ్మరసం వేసి నిమ్మకాయ రైస్, కొన్ని మసాలా పదార్థాలు వేసి స్పైసీగా చేసుకుని తినొచ్చు. ఇందులోనే కాస్తా ఎగ్స్ వేసి ఎగ్ వేసి ఎగ్ ఫ్రైడ్ రాసిలా చేసుకుని తినొచ్చు. మీకు నచ్చిన ఆకుకూరలు, కూరగాయలు వేసుకుని పులావ్, వెజ్ బిర్యానీల్లా చేసుకుని తినొచ్చు. ఇందులో మీ క్రియేటివిటీని యాడ్ చేసి మీకు నచ్చినట్లుగా ఫుడ్ చేసుకుని తినొచ్చు.
![]() |
![]() |