గుంటూరు మిర్చియార్డును జగన్ సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవడం టిడిపి నేతలకు వంటికి కారం పూసినట్టుందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎసి రూముల్లో స్టేట్మెంట్లు మాని టిడిపి నాయకులు అక్కడకుపోయి విచారిస్తే రైతులు కళ్ళలో కారంకొట్టి తన్ని పంపిస్తారని అన్నారు.టిడిపి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇలాంటి రైతు వ్యతిరేకవిధానాలను తామెప్పుడూ చూడలేదన్నారు. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు.
![]() |
![]() |