యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యం లో పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణం లోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం నాడు స్థానిక యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా 12 వ వేతన సవరణ ఒప్పందాలు అమలు చేయాలని, వారంలో 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని,రిక్రూట్ మెంట్ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని,కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ పెంచాలని,పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యం లో మార్చి 24,25 తేదీలలో 48 గంటల పాటు నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు.
![]() |
![]() |