హైదరాబాద్: ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై ఓ వ్యక్తి ఉండగా.. తన వాహనాన్ని సుమారు రెండు కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. డ్రైవర్ తన కారును చాలా రఫ్‌గా డ్రైవ్ చేసినా.. బ్యానెట్‌పై ఉన్న వ్యక్తి మాత్రం పట్టువదలలేదు. చివరకు పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఓ యువకుడు తన కారుతో మరో క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిలబడ్డాడు. కారును ఆపేందుకు నిరాకరించిన ఆ యువకుడు .. అదే జోరులో కారును డ్రైవ్ చేశాడు. కానీ క్యాబ్ డ్రైవర్ మాత్రం తన కారును ఢీకొట్టిన యువకుడి కారు బ్యానెట్‌ను పట్టుకుని వదల్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa