హైదరాబాద్: జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించుకున్నది. ఈ చర్య వల్ల అమెరికా కల్పించే వాణిజ్య లబ్ధిని భారత్ కోల్పోతుంది. ప్రస్తుతానికి ఈ పద్ధతి వల్ల భారత్‌కు సుమారు 190 మిలియన్ డాలర్ల లాభం చేకూరుతున్నది. అయితే ఈ అంశంపై ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. అమెరికా తీసుకున్న నిర్ణయానికి సమాధానం ఇవ్వాలంటే.. మనం ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్‌గా పనిచేయాలన్నారు. మన పనిలో మనం పోటీ తత్వాన్ని పెంచాలన్నారు. మరింత క్రమశిక్షణతో పనులను పూర్తి చేయాలన్నారు. ఇతరులను నిందించడం సరికాదు అని, మన పనిలో మనం బెటర్ అవుతేనే ఉత్తమ ఫలితం వస్తుందని నారాయణమూర్తి అన్నారు. మన పరిశ్రమలు బాగా పనిచేస్తేనే మనం మరింత బలంగా తయారవుతామని, పన్నులు అధిక స్థాయిలో చెల్లిస్తేనే మన సైనికులకు కావాల్సిన ఆయుధాలు అందుతాయన్నారు. సరైన రీతిలో పన్నులు చెల్లిస్తేనే సైనికులకు ఆయుధాలు సమకూర్చుకునే వీలు ఉంటుందని, వారి జీతాలు కూడా పెరుగుతాయని, బలవర్ధకమైన ఆహారం అందుతుందని అన్నారు. వాళ్ల ఫ్యామిలీలను వాళ్లు మంచిగా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. పుల్వామా దాడి పరిణామాల నేపథ్యంలో తాను ఈ విషయాన్ని చెప్పడం లేదని, 2014లోనూ ఇదే విషయాన్ని వెల్లడించినట్లు నారాయణమూర్తి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa