మినపప్పు కంటే మినుములు చాలా హెల్దీ. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దానిని అనేక రకాలుగా డైట్‌లో యాడ్ చేస్తారు. ఈ నల్ల మినములని తీసుకుంటే బాడీ ఇనుములా మారుతుందని చెబుతారు. అయితే, దీనిని ఎలా తీసుకోవాలనేది తెలిసి ఉండాలి. ముఖ్యంగా మినుములతో ఓ వంటకం చేసి తీసుకుంటే పిల్లలు, పెద్దలకి చాలా మంచిది. అదే గంజి. మరి ఆ వంట ఏంటి.. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
1 గ్లాస్ నీరు
మినుములని పొడిలా చేసి 1 టీ స్పూన్ తీసుకోండి.
యాలకులపొడి పావు టీ స్పూన్
తీపికోసం అరటిపండు ఒకటి
జీడిపప్పు, బాదంలని చిన్న ముక్కలుగా తరిగి ఓ టీస్పూన్ పరిమాణంలో తీసుకోండి.
ఉప్పు చిటికెడు
ఎలా తయారుచేయాలి?
ఓ వెడల్పాటి పాత్రలో నీరు పోసి మరిగించాలి. మరుగుతున్నప్పుడే మరో గిన్నెలో మినుముల పిండిని నీటిలో కరిగించి అందులో కలపండి. తర్వాత కలుుపుతూనే ఉండాలి. పిండి పచ్చి వాసన పోయిన తర్వాత మంటని తగ్గించి చిటికెడు ఉప్పు, అరటి పండు ముక్కలు, యాలకుల పొడి, నెయ్యిలో వేసిన నట్స్‌ని వేయండి.
దీనిని బాగా కలపి పిల్లలకి ఉగ్గులా పెట్టండి. 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఇది మంచి ఫుడ్.
పెద్ద వారికోసం
కావాల్సిన పదార్థాలు
నీరు 2 కప్పులు
మినుముల పిండి 2 టీస్పూన్లు
కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు
యాలకుల పొడి పావు టీ స్పూన్
అరటిపండు ముక్కలు ఓ పండు పరిమాణంలో
జీడిపప్పు, బాదం, ఖర్జూరం, నట్స్ అన్నింటిని కూడా చిన్నగా తురుములా తరిగి నెయ్యిలో వేయించాలి.
ఉప్పు చిటికెడు
తయారీ విధానం
ఓ పెద్ద గిన్నె పెట్టి అందులో నీరు వేసి మరిగించండి. ఆ నీటిలో మినపప్పు పొడిని నీటిలో కలిపి వేయండి. లేదంటే ఉండలు కడతాయి.
పిండిని కలుపుతూనే ఉండండి. దగ్గర పడుతుండగా కొబ్బరి తురుము వేయాలి. మంటని తగ్గించి చిటికెడు ఉప్పు, అరటిపండు ముక్కలు, యాలకుల పొడి, నెయ్యిలో ఫ్రై చేసిన నట్స్ వేయండి.
రోజూ ఉదయం 2 గ్లాసులు తాగితే బ్రేక్‌ఫాస్ట్‌ని తగ్గించొచ్చు. అయితే, అవసరాన్ని బట్టి మనం కొబ్బరిపాలు అలా కలిపి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
జీర్ణక్రియకి
మినుముల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. దీని వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది డయాబెటిస్‌ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. షుగర్ ఉన్నవారు మినుముల్ని రెగ్యులర్‌గా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
గుండెకి
మినుములు తినడం వల్ల గుండెకి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కొవ్వు స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇందులోని పొటాషియం ధమనులు, నరాల సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.
ఎముకలకి
నల్ల శనగల్లో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియం వంటి ముఖ్య ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకల ఖనిజ సాంద్రతని మెరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యల్ని మినుములు దూరం చేస్తాయి. ముఖ్యంగా ఆడవారికి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఆడవారు రెగ్యులర్‌గా తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది.
![]() |
![]() |