దేశీయ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా మరో మూడు ఎస్ఎంఈ ఐపీఓలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటుగా 5 కంపెనీల స్టాక్స్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. కొత్తగా వస్తున్న పబ్లిక్ ఇష్యూ మెయిన్ బోర్డ్ సెగ్మెంట్లో క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. మరి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలో ఏ కంపెనీలు ఉన్నాయి, వాటి సబ్‌స్క్రిప్షన్ తేదీలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్
ఎస్ఎంఈ సెగ్మెంట్‌కి చెందిన ఈ కంపెనీ ఐపీఓ ఫిబ్రవరి 24, 2025 రోజున సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన ముగియనుంది. ఒక్కో షేరు ధర రూ. 234గా నిర్ణయించారు. లాట్ సైజ్ 600 షేర్లు ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ. 1,40,400 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ సైజ్ రూ. 31.70 కోట్లుగా ఉంది. మొత్తం 13.55 లక్షల షేర్లను తాజా ఇష్యూ ద్వారా జారీ చేస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ కంపెనీ ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా సేవలందిస్తోంది. డెస్కులు, ప్రైవేటు క్యాబిన్ల, మీటింగ్ రూమ్స్ వంటి ఆఫీస్ సౌకర్యాలు అందిస్తోంది. 2024 డిసెంబ్ 31 నాటికి ఈ కంపెనీ 7 ఫెక్సిబుల్ వర్క్ ప్లేస్లు, 4 మేనేజ్డ్ ఆఫీసులు కలిగి ఉంది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, కొత్త కేంద్రాల ఏర్పాటుకు సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఉపయోగిస్తామని తెలిపింది.
శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్
ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఫిబ్రవరి 25, 2025 రోజున ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీతో ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ. 44గా నిర్ణయించగా లాట్ సైజ్ 3000 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక్క లాట్ కోసం రూ. 1,32,000 వెచ్చించాల్సి ఉంటుంది. రూ. 23.36 కోట్లు సమీకరించేందుకు పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా వస్తోంది. ఈ కంపెనీ 2011లో ప్రారంభించగా పేపర్ మెటీరియల్స్ ఉపయోగించే పరిశ్రమలకు సరఫరా పరిష్కారాలు అందిస్తోంది.
బాలాజీ పాస్పేట్స్ లిమిటెడ్
ఈ ఎస్ఎంఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఫిబ్రవరి 28న మొదలై మార్చి 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. స్టాక్ ధరను కంపెనీ ఖరారు చేయాల్సి ఉంది. మొత్తం 59.40 లక్షల షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా, 12.18 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. ఈ కంపెనీ 1996 లో ఏర్పాటు కాగా.. సింగిల్ సూపర్ పాస్పేట్, ఎన్పీకే గ్రాన్యూలేటెడ్ అండ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది.
5 కంపెనీల లిస్టింగ్స్
ఈ వారం మార్కెట్లో మొత్తం 5 కంపెనీల స్టాక్ లిస్టింగ్స్ ఉన్నాయి. మెయిన్ బోర్డ్ సెగ్మెంట్లో క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఐపీఓ ఫిబ్రవరి 24న లిస్ట్ కానుంది. ఎస్ఎంఈ ఐపీఓల్లో రాయల్ ఆర్క్ ఎలక్ట్రోడ్స్, తేజస్ కార్గో ఇండియా కంపెనీల షేర్లు ఫిబ్రవరి 24వ తేదీన, హెచ్ పీ ఇండియా, స్వస్థ్ ఫుడ్ టెక్ ఇండియా కంపెనీల ఐపీఓలు ఫిబ్రవరి 28వ తేదీన లిస్ట్ కానున్నాయి.
![]() |
![]() |