పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చాయి. మళ్లీ పెరగక ముందు కొనుగోలు చేయడం మంచిది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములపై రూ.330 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 87,770కి వచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు రూ. 80,450 వద్దకు చేరింది. ఇక వెండి ధర వరుసగా రెండో రోజూ దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1.07లక్షల వద్ద ఉంది.
![]() |
![]() |