గిరిజన సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సిదరపు అప్పారావు కోరారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని, సాలూరులో గిరిజన భవనం నిర్మించాలని, అటవీ పట్టాలు అందించాలని కోరారు. చెక్‌డ్యాములు నిర్మించాలని, దుగ్గేరు, నంద, వేటగానివలస, కురుకూటిలో పీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి శ్రీనివాసరావు, గాసి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |