అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు.
2022లో స్నేహితుల మధ్య విభేదాలతో దాడి జరగ్గా పవన్ మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జీవిత కారాగార శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
![]() |
![]() |