దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భాగల్‌పుర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమం వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేశారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 22 వేల కోట్లు విడుదల చేశారు. ఒక్కొక్క రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి.
రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ పథకాన్ని 2019, ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 11 కోట్ల మంది రైతులకు 18 విడతల్లో రూ. 3.46 లక్షల కోట్లు అంద జేశారు. అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే అంటే ఫిబ్రవరి 24, 2025 రోజునే 19వ విడత కింద రూ. 22 వేల కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేయడం గమనార్హం. ఒక్కోక్క రైతు ఖాతాలోకి రూ.2 వేల డిపాజిట్ కానున్నాయి.
19వ విడత నిధులు వచ్చాయా లేదా? తెలుసుకోండిలా..
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ htttp://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలోని కుడి వైపు ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి.
మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒక వేళ మీరు పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకుని ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమవుతాయి.
ఒక వేళ మీ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదంటే అసలు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకువోలి.
అందుకు బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేస్తే మరో పేజీకి తీసుకెళ్తుంది. అందులో రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి.
అప్పుడు మీ ఏరియాలోని లబ్ధిదారుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.
![]() |
![]() |