పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న రావల్పిండిలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిపేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు రిఫరీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్-బి పాయింట్ల పట్టిక చూస్తే దక్షిణాఫ్రికా, ఆసీస్ చెరో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa