గార్లదిన్నె మండలం కనంపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై న్యూస్ పేపర్లు సరఫరా చేసే ఆటోకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో ఆటో కాలిపోయింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
గురుమూర్తి అనే వ్యక్తి అనంతపురం నుంచి ఆటోలో న్యూస్ పేపర్లు తీసుకెళ్తుండగా బైక్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆటోని ఆపారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |