ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు చాలా తక్కువ నిధులు కేటాయించి, అన్యాయం చేస్తున్నారని యర్రగొండపాలం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. ప్రాజెక్టు పనులకు కేవలం రూ.359 కోట్లు కేటాయించారన్న ఆయన, ఈ నిధులు ఆ పనులకు ఏ మాత్రం సరిపోవని చెప్పారు. ఇంకా ఆర్ అండ్ ఆర్ (రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) ప్యాకేజీ కింద రూ.1000 కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.116 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా వెంటనే తగిన నిధులు కేటాయించాలన్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే, అసలు రైతులంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు అని, ప్రశ్నించారు.
![]() |
![]() |