రోజులో కొంతసేపైనా వర్కౌట్ చేయాలి. దీంతో బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి. బాడీకి చెమట పడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కరిగి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికోసం కొన్ని వర్కౌట్స్ చేయాలి. ఇవి ఎవరైనా హ్యాపీగా చేసేయొచ్చు.
రోజురోజుకీ చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యని తగ్గించడంలో డైట్ కీ రోల్ పోషిస్తే ఎక్సర్‌సైజ్ కూడా చాలా వరకూ కొలెస్ట్రాల్‌ని తగ్గించి టాక్సిన్స్‌ని దూరం చేస్తాయి. అందుకే, బాడీలోని కొలెస్ట్రాల్‌ని నేచురల్‌గానే తగ్గించి బాడీని డీటాక్స్ చేసే ఎక్సర్‌సైజెస్ గురించి తెలుసుకోండి.
బ్రిస్క్ వాక్
వాకింగ్ అనేది చాలా ఈజీ వర్కౌట్ కానీ, మంచి పువర్ ఫుల్ బెనిఫిట్స్‌ని అందిస్తుంది. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనం రోజుకి 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగ్గా మారి ఫ్యాట్ కరుగుతుంది. దీంతోపాటు బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. మీడియం రేంజ్ నుంచి కాస్తా స్పీడ్‌గా నడవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే, నడిచేటప్పుడు పోశ్చర్ సరిగా ఉండేలా చూసుకోండి.
స్విమ్మింగ్
స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీ ఎంగేజ్ అవుతుంది. దీంతో పాటు, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. బాడీలో హెల్దీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనిని చేయడం వల్ల బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ దూరమై ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. బాడీలోని టాక్సిన్స్ దూరమవుతాయి. రోజుకి కనీసం 20 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
సైక్లింగ్
సైక్లింగ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వర్కౌట్. దీనిని చేయడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కిడ్నీ ఫంక్షన్ మెరుగవుతుంది. బాడీ డీటాక్సీఫై అవుతుంది. రోజుకి కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
స్కిప్పింగ్
స్కిప్పింగ్ ఓ ఫన్ ఇంటెన్స్ కార్డియో వర్కౌట్. దీనిని చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది. కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో పాటు ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా మారుతుంది. దీంతో బాడీలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటికెళ్లిపోతాయి. అదే విధంగా కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. దీనికోసం కొద్దికొద్దిగా వాకింగ్ చేయాలి.
యోగా
యోగాలో కొన్ని ఆసనాలు మన జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో లివర్ పనితీరు పెరిగి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ట్విస్టింగ్ పోజెస్, డీప్ బ్రీథింగ్‌లాంటివి బాడీని నేచురల్‌గా డీటాక్స్ చేసి బ్లడ్ సర్క్యూలేషన్‌ని పెంచుతుంది. కోబ్రా పోజ్, బ్రిడ్జ్ పోజ్, కపాలభాతి ప్రాణాయామాలు చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.
![]() |
![]() |