రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ.837 కోట్లు కేటాయించింది. ఎంఎ్‌సఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రోత్సాహకాలకు రూ.1,400 కోట్లు, ఐటీఐలు, శ్రీసిటీ (ఐఐఐటీ), కాకినాడలోని హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లకు రూ.210 కోట్లు, దీన్‌దయాల్ అంత్యోదయ యోజన పథకం కింద నేషనల్ అర్బన్/రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌కు రూ.745 కోట్లు, పీ4 కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa