కూటమి సర్కార్ తీసుకునే కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగు పడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓ ప్రకటనలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించిందని, తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిందన్నారు. 1నుంచి 12 తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏటా రూ.,15 వేలు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించనుందని, ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా అందరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రులను మోసం చేసిన వైసీపీ ఇప్పుడు ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa