ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో నాగార్జున సాగర్ లో ‘వారబందీ’ విధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 10:28 AM

నాగార్జున సాగర్‌ కుడి కాల్వ ఆయకట్టులో ‘వారబందీ’ విధానం అమల్లోకి రానుంది. జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో జలవనరుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 9 రోజుల పాటు నీటి సరఫరా ఉంటుంది. తదుపరి 6 రోజులు నీటి సరఫరాను నిలిపివేస్తారు. జోన్‌-1 పరిధిలో ఆరు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తారు. జోన్‌-2 పరిధిలో నీటి సరఫరాను కొనసాగిస్తారు. వారబందీ అమలుపై వరి రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి సాధారణ విస్తీర్ణం 1,05,695 ఎకరాలు కాగా 86,730 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మిరపకు మార్చి నెలాఖరు వరకు నీటి అవసరం ఉంటుందని రైతులు తెలిపారు. వరికి ఏప్రిల్‌లో రెండు వారాల పాటు నీరు కావాలని చెబుతున్నారు.నాగార్జున సాగర్‌ జలాశయంలోని నీటిలో 29 టీఎంసీలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు కేఆర్‌ఎంబీ కేటాయించింది. వేసవిలో తాగునీటి అవసరాలకు 14 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల్లో పంటలు చేతికి వచ్చే వరకు 15 టీఎంసీల నీటిని పొదువుగా వాడుకోవాలి. 3 రోజుల క్రితం వరకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని కుడి కాల్వకు సరఫరా చేశారు. నీటి కేటాయింపులు జరగడంతో కుడి కాల్వకు సాగర్‌ నుంచి నీటి సరఫరాను 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa