అహ్మదాబాద్ : గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జవహర్ చవ్‌డా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి సమర్పించారు. జునాగఢ్ జిల్లాలోని మానవదర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్ చవ్‌డా గెలుపొందారు. చవ్‌డా రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. మానవదర్ నియోజకవర్గం నుంచి 1990, 2007, 2012, 2017 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు జవహర్ చవ్‌డా. ఈయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గతేడాది జులైలో సీనియర్ కాంగ్రెస్ నేత కున్‌వర్జీ బావలియా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశా పటేల్‌కు కూడా ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa