అన్నాచెల్లెళ్ల బంధం-టీడీపీతో అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు 'అన్న ఎన్టీఆర్’పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలేనని, ఇప్పుడు ‘చంద్రన్నపై కుట్రలను’ చిత్తు చేయాల్సింది మహిళలేనని పిలుపునిచ్చారు. మహిళలే తెలుగుదేశానికి జవజీవాలు అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ సీఎం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చదువులో, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతేనని చెప్పారు. ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ పెట్టింది టీడీపేనని చంద్రబాబు చెప్పారు. ‘‘ప్రతి కుటుంబానికి నాలుగైదు రకాల ప్రభుత్వ లబ్ది. ప్రభుత్వ లబ్ది పొందిన అందరి ఓట్లు తెలుగుదేశానికే. రైతులు, మహిళలు, యువతరం మద్దతు టీడీపీకే. మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాం. ప్రతి మహిళ ఖాతాలో ఈరోజే రూ.3,500 ఎంతో ఆనందంగా ఉంది. బోగస్ చెక్కులని అన్న వైసీపీకి మహిళలే బుద్ధిచెప్పాలి. ఇది మా చంద్రన్న ఇచ్చిన ‘పసుపు-కుంకుమ’ అని చాటాలి. ఈ 3 రోజులు అన్నిచోట్ల ర్యాలీలు, సభలు నిర్వహించాలి. దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa