ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి నేతృత్వంలో మహిళలకు సన్మానం…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 03:25 PM

అవకాశాలు లో సగం అంటూ స్త్రీలను ఆకాశానికి ఎత్తి నినాదాలు మనం చూస్తున్నాం కానీ,ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముందుగా వివిధ రంగాలలో సేవలు అందించిన శ్రీమతి బంగారి సత్యవతి, శ్రీమతి ఉంగరాల జయలక్ష్మి, శ్రీమతి పెంకెలక్ష్మీ,నిమ్మకాయల ధర్మ లను మహిళా నేతలు శాలువా కప్పి ఉచితరీతిన సత్కరించారు. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవజాతి మనుగడ కి ప్రాణం పోసింది మగువ అని కవులు స్తుతించిన, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అని వేదాలు ఘోషించిన, నాటి సీత, వేదవతి, ద్రౌపది, దమయంతుల నుంచి నిన్న మొన్నటి నిర్భయ వరకు మహిళలకు అడుగడుగునా గండాలే అన్నారు.ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కు రాజకీయ అనుభవం మితిమీరి పోయిందన్నారు. మహిళల వ్యతిరేకతను గుర్తించే ఎన్నికల ముందు చంద్రబాబు మహిళలకు తాయిలాలు గుప్పిస్తున్నారన్నారు. మోసపూరిత చంద్రబాబు మాటలు మహిళలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa