ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీని కలిసిన ఏపీ బీజేపీ నేతలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 03:26 PM

ఢిల్లీ : బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు ఈసీని కలిసి ఫామ్-7 పై ఫిర్యాదు చేశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారడంతో ఈ వ్యవహారంపై ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నారు. ఓట్ల తొలగింపుపై కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ డీజీపీని మార్చాలని అడిగినట్టు పేర్కొన్నారు. ఎవరు దొంగ ఎవరు కాదని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇరవై లక్షల ఓట్లు తెలుగు దేశం పార్టీ చేర్చిందని ఆ ఓట్లను తొలగించేందుకు ఆకరి సమయం వరకు తొలగించాలని అనుమతి తీసుకున్నామన్నారు. నివసించని వారివి, తెలంగాణలో ఉన్న వారివి ఓట్లను నమోదు చేయించినట్టు అనుమానాలున్నాయన్నారు. దొంగఓట్లను తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని పేర్కొన్నారు. సరైన ఓటు కాదని ఫాం-7ను ఎవరైనా ధరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఉన్న ఓట్లను తొలగించడటం ఏమిటని ప్రశ్నించారు. దొంగ ఓట్లను వేయించుకునేందుకు టీడీపీ పాల్పడుతోందని విమర్శించారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa