అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైకి మహిళలకు టైలరింగ్‌లో శిక్షణను ఇచ్చి, కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్టాళ్లు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa