ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ప్రాజెక్టులపై పర్యవేక్షణ గ్రూప్ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 09:48 AM

రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రత్యేకంగా ‘‘స్టేట్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌’’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రాజెక్టు పర్యవేక్షణ గ్రూపునకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా, ఇంధనం, పరిశ్రమలు, ఆర్‌ అండ్‌ బీ, టూరిజం, విద్య, మున్సిపల్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శులతో పాటు ఈడీబీ సీఈవో మెంబర్లుగా వ్యవహరిస్తారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. చైర్మన్‌ హోదాలో ఉన్న సీఎం, వైస్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న సీఎస్‌ కొంత మంది మెంబర్లను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. స్టేట్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌ రాష్ట్ర ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఈడీబీ) పరిధిలో ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ పాలన వ్యవహారాలు చూసుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa