అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), కాపులకు విద్య, ఉపాధి అవకాశాల్లో ఐదు శాతం చొప్పున రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులను అనుసరించి ఇకపై ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టే ప్రవేశాలు, ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టే నియామకాల్లో కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5% చొప్పున రిజర్వేషన్లు వర్తిస్తాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa