హైదరాబాద్: సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్ధాలను ఇవాళ కోల్‌కతా పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి నార్త్ పర్గనాస్ దిశగా వెళ్తున్న ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్‌లోని తలా బ్రిడ్జ్ వద్ద టాటా మెటాడోర్ వాహనంలో ఆ పేలుడు పదార్ధాలను తరలిస్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. మొత్తం 27 బ్యాగుల్లో పొటాషియం నైట్రేట్ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నడిపిస్తున్న డ్రైవర్‌ను, హెల్పర్‌ను అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa