స్మాల్ క్యాప్ కేటగిరి, ఫార్మా సెక్టార్ కంపెనీ శుక్రా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ అందించింది. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్టాక్ స్ప్లిట్‌కి సంబంధించిన రికార్డు తేదీని సైతం నిర్ణయించింది. మరోవైపు ఈ కంపెనీ షేరు గత 6 నెలల్లోనే ఏకంగా 278 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 250 ల వద్ద ఉన్న షేర్ ధర రూ. 25 ల స్థాయికి తగ్గనుంది.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ఆమోదం తెలుపారు. అంటే రూ. 10 ఫేస్ వ్యాల్యూ గల ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 10 షేర్లుగా మార్చనుంది. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ స్టాక్ స్ప్లిట్ సంబంధించిన అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని మార్చి 21, 2025గా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ తేదీలోపు షేర్లు కొనుగోలు చేసిన వారికి 1 షేరు 10 షేర్లు మారతాయి. స్టాక్ ధర సైతం తగ్గుతుంది.
స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో శుక్రా ఫార్మాస్యూటికల్స్ షేరు ధర 2 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ తాకింది. చివరకు రూ. 236.40 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 271.50 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 57.52 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 2 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఈ షేరు 10 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో సుమారు 278 శాతం లాభాన్ని అందించింది. పెట్టుబడిని మూడింతలకుపైగా చేసింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 183 శాతం లాభాన్ని ఇచ్చింది. ఇక గత ఐదు సంవత్సరాలలో 9134 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1040 కోట్ల వద్ద ఉంది.
దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్ శుక్రా ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీని గతంలో రెలిష్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌గా పిలిచేవారు. 1993వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ అహ్మదాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు నిర్వహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa