మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 రన్స్ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చివరి వరకూ పోరాడినా విజయం మాత్రం సాధించలేకపోయింది. చివరకు సరిగ్గా 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 9 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
కాగా మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఇది వరకే ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పాయింట్ల పట్టికలో గుజరాత్ 2, ముంబై మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ లీగ్‌లో లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో ముంబై, గుజరాత్ జట్లు.. ఆ బెర్తుపై కన్నేశాయి.
ఇందులో భాగంగా ముంబై వేదికగా ఈ రెండు జట్లూ ఇవాళ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మూడో స్థానం నుంచి రెండో ప్లేసుకు ఎగబాకింది. ఏడు మ్యాచ్‌లలో ఐదింట్లో గెలిచింది ముంబై. 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో మూడో ప్లేసులో గ్రూప్ దశను ముగించింది గుజరాత్.
ఇక ఈ లీగ్‌లో చివరి లీగ్ దశ మ్యాచ్‌లో మంగళవారం ముంబై, ఆర్సీబీ తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. అలా కాకుండా ఓడిపోతే మాత్రం.. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ముంబై జట్టు ఎలిమినేటర్‌లో మళ్లీ గుజరాత్‌తోనే తలపడాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa