వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిలుపుదల చేసింది. తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టినట్లు తెలుస్తుంది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్ వివరాల్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత వ్యతిరేకించారు. అదే దిశ యాప్‌ని ఫీచర్ల విషయంలో కాపీ కొట్టినట్లు కొందరు విశ్లేషకులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa