సీనియర్ సినీనటి సుమలతా అంబరీష్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు మంత్రి రేవణ్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బెంగుళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి రేవణ్ణ.. ‘భర్త చనిపోయి నెల రోజులు కాలేదు. అప్పుడే సుమలత అంబరీష్‌కు రాజకీయాలు అవసరమా?’ అని అన్నారు. మహిళా దినోత్సవం రోజే మహిళను కించ పరుస్తూ మాట్లాడిన మంత్రి రేవణ్ణపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సుమలతను సంప్రదించగా.. దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు తాను చేయనని అన్నారు.
సుమలత కాంగ్రెస్ పార్టీ తరుపున మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును జేడీఎస్ పార్టీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో తాను ఇండిపెండెంట్‌గానైనా మండ్యలో పోటీ చేయాలని సులమత పట్టుబట్టి కూర్చున్నారు. అయితే సుమలతతో దేవెగౌడ, సీఎం కుమారస్వామి ఆమెతో సమావేశమయ్యారు. జేడీఎస్ తరపున మైసూరు-కొడగు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారు. సుమలత మనసు మార్చుకుంటుందా? లేక ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తుందా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa