అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లి - కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికుల మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa