పెందుర్తి మండలం కోటనరవలో వైసీపీ ఆవిర్భావం దినోత్సవం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు ఎం. సత్యరావు, ఎస్. సతీష్, ఎం. నూక అప్పారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి నిరుపేదలను ఆదుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.
![]() |
![]() |