ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డింగ్‌ డ్యాన్సర్‌కు ముద్దులు..స్టేజ్‌పై బూతు పాటలతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే!

national |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:40 PM

ఓ ప్రజాప్రతినిధి బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడమే కాదు.. స్టేజ్‌పైకి ఎక్కి బూతు పాట పాడి రెచ్చిపోయారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఇలా ప్రవర్తించడంపై జనం విస్తుపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌‌‌కు చెందిన జేడీ (యూ) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ నీరజ్‌ అలియాస్‌ గోపాల్‌ మండల్‌.మరోసారి వార్తల్లో నిలిచారు. భగల్‌పూర్‌ జిల్లాలో తన నియోజకవర్గం గోపాల్‌పూర్‌లోని నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్కడ వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది.


తొలుత వేదికపై ఉన్న డ్యాన్సర్ దగ్గరకు వెళ్లిన ఆయన.. ఆమెను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించి... అక్కడితో ఆగలేదు. నేను డ్యాన్స్‌ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకు ముందు గట్టిగా అరిచారు. పోనీ ఆయన అరాచకం అంతటితో ముగియలేదు. రాత్రి వేళ జరిగిన వేడుకల్లోనూ సదరు ఎమ్మెల్యే పాల్గొన్నారు. రికార్డింగ్‌ డ్యాన్సర్ల గంతులు వేసి.. ఆపై మైక్‌ అందుకుని ఆశ్లీల పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు.


ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రతిపక్ష ఆర్జేడీ మండిపడింది. ఈ సంఘటన నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ విలువలకు అద్దం పడుతుందని ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రన్‌విజయ్ సాహు ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలను సమర్ధించకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేవలం జేడీ (యూ) మాత్రమే కాదు.. సంప్రదాయ జాతీయవాదాన్ని భుజాలకెత్తుకున్న వారి మిత్రపక్షం బీజేపీ సైతం మండల్ ప్రవర్తనకు బాధ్యతవహించాలని ఆర్జేడీ ఎమ్మెల్యే ముకేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అలాగే, నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై కేసులు పెడతారా? చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా కోర్టులు చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


అయితే, ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన రైల్లో బనియన్, అండర్‌వేర్‌ తిరగడం సంచలనంగా మారింది. ప్రయాణికులు కొందరు అతడి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆయన ఊహాతీత చర్యలకు షాకైన ప్రయాణికులు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగి.. తన రివాల్వర్ తీసి కాల్చుతానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రైలు ఎక్కిన తర్వాత కడుపులో గడబిడ మొదలయ్యిందని తెలిపారు. ‘ఆపుకోలేనంత కష్టం’ రావడంతో కూర్చున్న చోటే కుర్తా, పైజామా లో దుస్తులతో బాత్‌రూమ్‌కి పరుగులు పెట్టాల్సి వచ్చిందన్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa