మార్చి 10 తేదీన ఆదివారంనాడు నిర్వహించనున్న 25వ విడత పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించిన తిరుమలలో శనివారంనాడు టిటిడి ఆధ్వర్యంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జనమెడికల్ సూపరింటెండెంట్ డా|| ఏ.బి. నర్మద మరియు డా|| కుసుమకుమారి నేతృత్వంలో యస్.వి. హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
సుమారు 100 మంది తిరుమల యస్.వి హైస్కూల్ విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానికంగా పలు నివాస ప్రదేశాలలో పర్యటించింది. ''మన పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం - పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం'' అని విద్యార్థులు చేసిన నినాదంతో తిరుమల నివాస ప్రదేశాలు మారుమ్రోగాయి. ఈ ర్యాలీలో అశ్విని అసుపత్రి సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో తిరుమలలోని 25 ప్రాంతాల్లో పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాలలో ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు 0-5 ఏళ్ళ లోపు చంటి పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు మరియు స్థానికులు సద్వినియోగం చేసుకోగలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa