పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి దంపతులు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో… కర్నూలులో మిగిలిపోయిన కొద్ది ప్రాంతం పసుపు మయం అవుతోంది. గౌరు దంపతులతో పాటుగా పలువురు వైసీపీ కీలక నాయకులు, మండల స్థాయి నాయకులు, వైసీపీ అనుబంధ సంఘాల నాయకులు కూడా టీడీపీలో చేరనున్నారు. పలువురు నాయకులు గౌరు వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన ఓ సమవేశంలో వైసీపీకి రాజీనామా చేశారు. ఈ పత్రాలను రాష్ట్ర నాయకత్వానికి పంపారు.
పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కర్నూలు కార్పొరేషన్ కల్లూరు అర్బన్ వార్డులు, రూరల్, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల నుంచి 500 వాహనాల్లో గౌరు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అమరావతికి బయలుదేరారు.ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం ప్రజావేదికలో గౌరు దంపతులు టీడీపీలో చేరనున్నాను. గౌరు దంపతులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి ఎంతో విధేయతగా ఉంటూ వచ్చారు. నందికొట్కూరు నుంచి గౌరు వెంకటరెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అదే నియోజకవర్గం నుంచి వెంకటరెడ్డి సతీమణి గౌరు చరితను బరిలో దింపితే ఆమె విజయం సాధించారు. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో గౌరు చరిత 2009 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కూడా గౌరు కుటుంబం జగన్‌కు అండగా నిలిచింది.
ఆయన వెంటే నడిచింది. ఆ దంపతులు వైసీపీలో కీలకంగా ఎదిగారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం గౌరు వెంకటరెడ్డి కృషి చేశారు. 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలిచారు. ఇటీవల వైసీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాణ్యం టికెట్‌పై గౌరుకు స్పష్టత ఇవ్వకపోగా.. ఆమెను జగన్ అవమానించారు. దాంతో.. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa