నడు వెంకన్న కడకు అంటూ తిరుమల తిరుపతిలోని వెంకన్న దర్శనాన్ని వేణువై వచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న డాక్టర్ లయన్ వేణుకుమార్ చుక్కలను అభినందనలు తెలిపారు ప్రముఖ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ . శనివారం ఉదయం తిరుమలగిరిలోని తన నివాసంలో శ్రీ అష్టోత్తర శత 108 చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేణుకుమార్ చుక్కల క్రియేట్ చేసిన తిరుమల యాత్రలకు సంబందించిన యూ ట్యూబ్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ లక్ష మంది సకలాంగులతో ఒక వికలాంగుడు సేవ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ వేణుకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి తనివితీరా సేవ చేయాలని, ఆయన కరుణా కటాక్షములు అందరికి లభించాలని భావించి వికలాంగులను, గుడ్డి వారిని తీసుకుని వారికి దర్శన భాగ్యం కల్పిస్తున్న వేణుకుమార్ కి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి వారి సేవ చేసే భాగ్యం మరింత ఇవ్వాలని కోరుతూ దేవున్ని వేడుకొంటున్న.ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నాయకుడు కోనేరు భాస్కర్, పిల్లల శ్రీనివాస్, మేనేజర్ వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa