ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకాశ్ అంబానీ పెళ్లి.. అతిథులుగా అంతర్జాతీయ ప్రముఖులు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 09:13 PM

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో అంగరంగవైభవంగా జరుగుతోంది. ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లివేడుక పరిసరాలు.. బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడుతున్నాయి. ఇక, వీఐపీలు, వీవీఐపీల కేటగిరీలో అతిరథులు ఆకాశ్, శ్లోకాల వివాహ వేడుకకు హాజరుకాబోతున్నారు. అలాంటి కీలక అతిథుల లిస్టు పెద్దగానే ఉంది. ఇందులో అంతర్జాతీయ అతిథులు కూడా ఉండడం విశేషం. దీంతో ఆ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్.. భార్య అమృతతో కలిసి ఆకాశ్ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, మాజీ మంత్రి అనంద్ శర్మ తదితరులు పెళ్లివేడుకకు హాజరవనున్నారు. ముంబైలో జరుగుతున్న ఆకాశ్, శ్లోకాల వివాహ మహోత్సవానికి.. అంబానీ కూతురు ఈశా తన భర్త ఆనంద్‌తో కలిసి విచ్చేయనున్నారు. వీరితో పాటు పిరామిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరమల్ ఆయన భార్య స్వాతి కూడా హాజరు కానున్నారు. ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు హాజరు కానున్నారు.
ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అతిథులు సైతం తరలివచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్.. భార్య చెరీ బ్లేయర్‌తో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. అంబానీ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భార్య అంజలీ పిచాయ్‌తో కలిసి హాజరయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు కూడా ఈ విశిష్ట అతిథుల లిస్టులో ఉన్నారు. తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు .ఇప్పటికే ప్రిన్సెస్ దియాకుమారి,  క్రికెటర్లు హార్థిక ప్యాండా, మాజీ క్రికెటర్ రాబిన్‌సింగ్, శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్దనే, బాలీవుడ్ సెలబ్రిటీలు జూహి చావ్లా, రణ్‌భీర్ కపూర్, కరణ్ జోహర్.. ఎన్సీపీ నేత ప్రఫూల్ పటేల్ తదితరులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆకాశ్ పెళ్లిలో అనిల్ అంబానీ ఫ్యామిలీ, గెస్ట్ లిస్టులో మరికొందరు కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులూ ఉన్నారు. శ్యాంసంగ్ వైఎస్ ప్రెసిడెంట్ జే వాయిలీ, అంతర్జాతీయ ఒలింపిక్ సమితి సభ్యుడు క్రిస్టోఫ్ డీ కేపర్, సౌదీ ప్రభుత్వ మంత్రి ఖలిద్ ఫలీహ్, బెల్జియం రాజనీతిజ్ఞులు, యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు వెరోనిక్ డీ పెపర్ తదితరులు ఉన్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్ అంబానీ శ్లోకాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa