ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎంపీగా లగడపాటి పోటీ...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 09:19 PM

చంద్రబాబుతో అప్పుప్పుడు సమావేశమవుతున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని అనేక సార్లు తెలిపారు. అయినా ఆంధ్రా ఆక్టోపస్ పొలిటికల్ రీ-ఎంట్రీకి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... అన్నట్టుగానే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా... ప్రజల నాడిని ఒడిసి పట్టుకునే విధంగా సర్వేలు చేయించడం మాత్రం ఆయన మానుకోలేదు. కీలకమైన ఎన్నికలకు ముందు తన టీమ్ ద్వారా సర్వేలు చేయించి రాజకీయ పార్టీలకు అందిస్తున్న లగడపాటి... కొద్దిరోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి తన సర్వే సేవలను అందిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో అప్పుప్పుడు సమావేశమవుతున్న ఈ ఆంధ్రా అక్టోపస్... మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని అనేక సార్లు తెలిపారు.
అయితే తాను మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోనని లగడపాటి రాజగోపాల్ ఎంతగా చెబుతున్నా... ఆయన పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి లగడపాటి పోటీకి సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి... ఈ సారి టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం నరసరావుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో లగడపాటి ఏకాంతంగా చర్చలు జరపడం వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఇదేననే వార్తలు జోరందుకున్నాయి.


 


మరోవైపు నరసరావుపేట ఎంపీగా మరోసారి తానే పోటీ చేస్తానని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి కోడెలను ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా చాలాకాలంగా సాగుతోంది. మరి... వీరిని కాదని లగడపాటి రాజగోపాల్ నరసరావుపేట ఎంపీ సీటును దక్కించుకుంటారా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే శనివారం సాయంత్రం నరసరావుపేట పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఆశావాహులతో జరిపే చర్చల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa