ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని మాజీమంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్ లు, చివరికి జర్నలిస్ట్ లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళమని అయన తెలిపారు.
![]() |
![]() |