భూ సమస్యలతో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం నాలుగు నెలలుగా ఆలస్యం అయ్యిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆరు నెలల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. మళ్లీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ప్రారంభిస్తామని చెప్పారు. రూ. 11 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక రోజుకు 15 టన్నులు ప్రాసెసింగ్ అవుతుందన్నారు. టమాటాతో పాటు ఈ యూనిట్‌లో ఇతర పండ్ల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకోవచ్చని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక నుంచి రైతులు గిట్టుబాటు ధర లేక టమాటాను రోడ్లమీద పారబోసే పరిస్థితి ఉండదని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రావాలని సీఎం చంద్రబాబు నుంచి అదేశాలు వచ్చాయని అన్నారు. ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఇతర పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది.. ఇండియా మ్యాప్‌లో కనిపించేది కాదని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
![]() |
![]() |