ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో తిరుమల మాఢవీధుల్లో హంగామా సృష్టించాడు. నేను లోకల్మ ద్యం తాగుతా అవసరమైతే మద్యం అమ్ముతా అంటూ అరుపులతో రెచ్చిపోయాడు. ఓ మహిళతో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. కాగా, తిరుమలలో మద్యంపై నిషేధం ఉంది. తిరుపతిలో అలిపిరి వద్ద కూడా కొండపైకి వెళ్లేవాళ్లను చెక్ చేస్తుంటారు. అలాంటిది, అతడు మద్యం తాగి కొండపైకి వచ్చాడా, లేక కొండపైనే మద్యం తాగాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
![]() |
![]() |