అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), ప్రగతి రెడ్డి అత్త సునీత (56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో స్వగ్రామం టేకులపల్లిలో విషాధ చాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |