ఒంగోలులో ఓ పోలీస్ అధికారిపై మైనర్ కత్తితో దాడికి ప్రయత్నించాడు. దాడి చేసిన బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావుపై ఓ మైనర్ కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. శనివారం సాయంత్రం వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ మార్కెట్ మీదుగా సీఐ పాండురంగారావు కారులో వెళ్తున్నారు. అయితే భారీ ట్రాఫిక్ జామ్ కావటంతో ఆయన కారు ఆపారు. కారు దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పండ్లు అమ్ముతున్న ఓ మైనర్‌ను పక్కకు వెళ్లాల్సిందిగా సీఐ పాండురంగారావు ఆదేశించారు. అరటి పండ్లు అమ్ముతున్న యువకుణ్ని పక్కకు వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం సమయంలో సదరు మైనర్ సీఐపై కత్తితో దాడికి యత్నించినట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఆ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఉన్న పండ్ల దుకాణాలను తొలగించారు. అలాగే ట్రాఫిక్ ఎస్ఐ మాల్యాద్రి ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తనకు ఆదేశించినట్లు తెలిసింది.
మరోవైపు ఒంగోలు పోలీసులు టెక్నాలజీ వాడకం మొదలెట్టారు. నిన్న మొన్నటి వరకూ పెట్రోలింగ్ కోసం వాహనాలను ఉపయోగించిన పోలీసులు.. ఇప్పుడు డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. డ్రోన్లను పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా, ఏదైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం అందితే డ్రోన్లను ఒంగోలు పోలీసులు రంగంలోకి దింపుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం, కోడిపందేలు, పేకాట సహా ఇతర అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెంచారు.నాటుసారా తయారీ, గంజాయి సాగుతో పాటుగా ఈవ్‌టీజింగ్ అడ్డుకోవటానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
![]() |
![]() |