రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏటా నిర్వహించే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో చిన్నస్వామి స్టేడియం నిండిపోయింది. టికెట్లు కొనుక్కుని మరీ.. ఆ జట్టు ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. దీంతో ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే.. చిన్నస్వామి స్టేడియంలో సందడి మొదలైంది.
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్‌తో కబుర్లు చెప్పుకునేందుకు ఆటగాళ్లంతా వచ్చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
మిరుమిట్లు గొలిపే విద్యుత్ ధగధగలతో స్టేడియం మెరిసిపోయింది. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ చేసే నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఈ సీజన్ ద్వారా తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి అడుగుపెట్టిన ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెతెల్ వంటి ప్లేయర్లు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇక ఫ్యాన్స్‌ను ఉత్సాహపరించేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో ఆటపాటల ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. స్పెషల్ లైట్ షో ఏర్పాటు చేసింది. టపాసులు కాల్చింది. అంతకుముందు జట్టులోని ప్లేయర్లతో సిక్స్ హిట్టింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఇందులో వెస్టిండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ అందరికంటే ఎక్కువ దూరం బంతిని బాది విజయం సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ షేర్ చేసింది. ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి..
తొలుత ఫిలిప్ సాల్ట్ ఈ పోటీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రొమారియో షెఫర్డ్ భారీ సిక్స్ కొట్టాడు. అనంతరం చాలా మంది ప్లేయర్లు ఈ పోటీలో పాల్గొన్నా.. షెఫర్డ్ సిక్స్‌ను బీట్ చేయలేకపోయారు. లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ లాంటి ప్లేయర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. చివరకు రొమారియో షెఫర్డ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిక్స్ హిట్టింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
![]() |
![]() |