ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధం అవుతుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా జట్టు శిబిరంలో చేరిపోతున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు హైదరాబాద్ చేరుకున్నాడు. తాజాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా సోమవారం (మార్చి 17) సన్‌రైజర్స్ శిబిరంలో చేరిపోయాడు. ట్రావిస్ హెడ్ కూడా ఇవాళే (సోమవారం) జట్టుతో కలిశాడు.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జట్టులో చేరిపోయినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “ష్.. అందరూ సైలెంట్‌గా ఉండండి.. అతడు వస్తున్నాడు” అని ఓ యంగ్ ఫ్యాన్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీకి ముందు మాట్లాడాడు. దీంతో ఐపీఎల్ 2025లో ప్యాట్ కమిన్స్ ఎంట్రీ ఖరారైపోయింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరమైన కమిన్స్.. పూర్తిగా కోలుకోవడంతో సన్‌రైజర్స్‌కు అందుబాటులోకి వచ్చేశాడు.
ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. అయితే టైటిల్ వేటను సన్ రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది ఫైనల్‌లో ఓడి.. రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కావ్య మారన్ టీమ్ ఈసారి ఐపీఎల్ వేలంలో చురుగ్గా వ్యవహరించి హైదరాబాద్ జట్టు కోసం కీలకమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకొని, కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కామిండు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఈషన్ మలింగ్, ఆడమ్ జంపా జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కేర్స్, అథర్వ ట్రేడ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అనికేత్ వర్మ.
![]() |
![]() |