రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్‌రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను 200గా నిర్ణయించింది. జిల్లాను యూనిట్‌గా చేసుకుని అమలు చేయాలని కొంత మంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2026లో జనగణన జరిగాక జిల్లాలవారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని, ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
వర్గీకరణలో ఎవరికెంత రిజర్వేషన్?
గ్రూప్-1 (రెల్లి కులస్థులు)
సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫారసు చేసింది.
గ్రూప్-2 (మాదిగ, ఉపకులాలు) 6.5%
జనాభా దామాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి 6.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ పేర్కొంది.
గ్రూప్-3 (మాల, ఉపకులాలు)7.5%
జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని నివేదిక పేర్కొంది.
![]() |
![]() |