తిరుపతిలో పలువురి ఆక్రమణల్లో ఉన్న బుగ్గమఠం భూములపై మంగళవారం కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశానికి రెవెన్యూ, దేవదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు హాజరుకానున్నారు. ‘ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకుగానూ బుగ్గమఠం అధికారులు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అందులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయాలన్నీ తెలిసినవే. అయితే... ప్రభుత్వం మారినా బుగ్గమఠం భూములను సర్వే చేయలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. మఠం భూముల రికార్డులతో సమీక్షకు హాజరు కావాలని దేవదాయ శాఖ తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్, జిల్లా దేవదాయ శాఖ అధికారి, తిరుపతి ఆర్డీవో, బుగ్గమఠం ఈవో, తిరుపతి అర్బన్ తహసిల్దార్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు ప్రారంభమయినట్లేనని యంత్రాంగం అనుకుంటోంది.
![]() |
![]() |